అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya).. సాయిపల్లవి(Sai Pallavi) జంటగా నటించిన “తండేల్(Thandel)” మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (Prerelease event)ఆదివారం రాత్రి గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్(HYD)లో నిర్వహించిన ఈ ఈవెంట్‌కు తొలుత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) వస్తాడని మేకర్స్ ప్రకటించారు. కానీ ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) బన్నీ రాకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. తీవ్రవైన గ్యాస్‌ట్రిక్ సమస్య(Gastric problem) కారణంగా అల్లు అర్జున్ ఈ ఈవెంట్‌కు రాలేకపోయాడని తెలిపారు. అతను ఫారిన్ నుంచి వచ్చాడని, ఫుడ్, వాతావరణం మారడంతోనే రాలేదని, అభిమానులు, మూవీ యూనిట్ సభ్యులు ఏమనుకోవద్దని కోరారు. కాగా డైరెక్టర్ చందూ మొండేటి(Director Chandu Mondeti) తెరకెక్కించిన ఈ మూవీ ఈనెల 7న థియేటర్లలోకి రానుంది.
Producer Allu Aravind Confirms That Icon Star @alluarjun Who Was About To Attend The #Thandel Pre Release Event Couldn’t Make It Up Today, As He is Suffering From Severe Gastritis Issue After His Foreign Visit !#AlluArjun #SaiPallavi #NagaChaitanyapic.twitter.com/BjyAT5GHOj
— Mugunth (@Mugunth1719) February 2, 2025
థియేటర్లలో కచ్చితంగా దుల్లగొట్టేస్తాం: నాగచైతన్య
కాగా ప్రీ రిలీజ్ వేడుకలో హీరో నాగచైతన్య(Naga Chaitanya) మాట్లాడుతూ.. తండేల్ మూవీ చివరి దశలో తనకు భయం ప్రారంభమైందని అన్నారు. చిత్ర నిర్మాణంలో అల్లు అరవింద్, బన్నీవాసు(Bunny Vasu) ఎంతో సహకరిస్తారని తెలిపారు. తన దృష్టిలో గీతా ఆర్ట్స్(Geeta Arts)కు ఎప్పుడూ అగ్రస్థానమేనని పేర్కొన్నారు. తండేల్ గురించి బన్సీవాసు 10 నిమిషాలు చెప్పారని, అప్పుడే ఈ సినిమాపై ఎంతో ఆసక్తి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇక సినిమాలో తండేల్ రాజుకు, తన జీవితానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని నాగచైతన్య పేర్కొన్నారు. ఆ పాత్రలోకి మారేందుకు చందు తనకు కావాల్సినంత సమయం ఇచ్చాడని తెలిపాడు. చందు కాంబినేషన్‌లో తనకు ఇది మూడో సినిమా అని, సాయిపల్లవి పట్ల ఇంతటి అభిమానాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ‘‘ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతుంది.. థియేటర్లలో కచ్చితంగా దుల్లగొట్టేస్తాం” అని నాగ చైతన్య అన్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ మొత్తం ఇక్కడ చూసేయండి..








