Mana Enadu : తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారతీయులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. పుష్పరాజ్ మరోసారి ఆడియెన్స్ మనసు ఏలేందుకు వచ్చేశాడు. బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేందుకు పుష్ప పార్ట్-2 త్వరలోనే థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ (Pushpa 2 Trailer) చేశారు. బిహార్ పట్నాలో ఆదివారం (నవంబరు 17న) గ్రాండ్ గా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
పట్నాలో పుష్ప ట్రైలర్ రిలీజ్ ఈవెంట్
పట్నా గాంధీ మైదాన్‌లో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్లో ‘పుష్ప ది రూల్ (Pushpa The Rule)’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు హీరో అల్లు అర్జున్ (Allu Arjuna)- రష్మిక మందన్నాతో పాటు చిత్రబృందం హాజరైంది. పుష్ప రాజ్ ను చూసేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది అభిమానులు వచ్చారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పార్టీ ఉంది పుష్పా
“ఎవడ్రా వాడు.. డబ్బంటే లెక్కలేదు.. పవర్ అంటే భయం లేదు”.. అంటూ జగపతి బాబు (Jagapatibabu) వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ షురూ అయింది. ‘పుష్ప.. పేరు చిన్నది.. కానీ సౌండ్ మాత్రం చాలా పెద్దది.. పుష్ప అంటే పేరు కారు.. బ్రాండ్’.. అంటూ వచ్చిన డైలాగ్స్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేశాయి. ‘పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్.. పార్టీ ఉంది పుష్ప’ అంటూ అదిరిపోయే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘శ్రీవల్లి నా పెళ్లాం. పెళ్లాం మాట మొగుడింటే ఎట్టా ఉంటదో ప్రపంచానికి చూపిస్తానంటూ’ పుష్పరాజ్ చెప్పిన డైలాగ్ కు లేడీ ఫ్యాన్స్ తెగ ఫ్యాన్స్ అయిపోతున్నారు.
శ్రీలీల స్పెషల్ డ్యాన్స్
సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ఇండియా లెవెల్లో డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ (Pushpa 2 Release Date) అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల (Sreeleela) స్టెప్పులేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే పుష్ప రాజ్ ఈసారి కూడా బాక్సాఫీస్ వద్ద తగ్గేదే లే అంటూ తన హవా చూపించబోతున్నాడని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.