Mana Enadu : టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కల్యాణ వేడుకకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. డిసెంబరు 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరిగే ఈ వేడుకను నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రముఖులు, బంధువులు, సన్నిహితులకు ఆహ్వానాలు పంపుతున్నట్లు తెలిసింది.
సోషల్ మీడియాలో శుభలేఖ వైరల్
అయితే తాజాగా ఈ జంట పెళ్లికి సంబంధించిన శుభలేఖ(naga chaitanya sobhita dhulipala wedding date) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా శోభిత తరపున బంధువులకు ఇస్తున్న వివాహ ఆహ్వాన పత్రిక ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.పెళ్లి కార్డుతో పాటు ఓ బుట్ట.. ఆ బుట్టలో చీర, పసుపు కుంకుమ, వెండి వస్తువు.. వీటన్నింటిని కలిపి పెళ్లి కార్డుగా ఆహ్వానం అందించారు.
మీ దీవెన మాకు దక్కే గౌరవం
ప్రస్తుతం ఈ కార్డుకు సంబంధించిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ శుభలేఖలో వధువు, వరుడు తల్లిదండ్రులతో పాటు, వాళ్ల తాతయ్య బామ్మల పేర్లను కూడా చేర్చడం కార్డులో చూడవచ్చు. ‘ఈ ప్రత్యేకమైన సందర్భంలో మీ శుభాకాంక్షలు, దీవెనలు మాకు దక్కే గొప్ప గౌరవం’ అని ఆహ్వాన పత్రికలో రాసి ఉంది. ఈ కార్డు చూసి నాగచైతన్య (Naga Chaitanya Marriage) ఫ్యాన్స్ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
#NagaChaitanya and #Sobhita Wedding Card Revealed pic.twitter.com/lSxTsPmVnp
— KLAPBOARD (@klapboardpost) November 17, 2024
ఆగస్టులో నిశ్చితార్థం
నాగచైతన్య, శోభితా ధూళిపాళ (Shobita Marriage) నిశ్చితార్థం ఈ ఏడాది ఆగస్టులో జరిగిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సమక్షంలో హైదరాబాద్ లో ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ నాగార్జున ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు.







