ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ పుష్ప2 : ది రూల్ (Pushpa 2 : The Rule). డిసెంబరు 5వ తేదీన థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పూనకాలు తెప్పిస్తోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.1800 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ప్రస్తుతం థియేటర్లలోనూ పుష్పరాజ్ హవాయే నడుస్తోంది. అయితే త్వరలోనే పుష్పరాజ్ డిజిటల్ జాతర షురూ కాబోతున్నట్లు తెలిసింది.
అప్పుడే స్ట్రీమింగ్
పుష్ప 2 త్వరలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. జనవరి చివరి వారంలో నెట్‌ఫ్లిక్స్ (Pushpa 2 Netflix) వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సంస్థ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత సినిమాలు నాలుగు నుంచి ఆరు వారాల్లో ఓటీటీలోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇక పుష్ప-2 చిత్రం బాక్సాఫీస్ వద్ద రఫ్ఫాడిస్తున్నందున 8 వారాలు పూర్తయిన తర్వాత మాత్రమే స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు.
జనవరి 31న ఓటీటీలోకి
ఈ నేపథ్యంలో ఎనిమిది వారాల గడువు జనవరి 29వ తేదీ లేదా 30వ తేదీతో పూర్తి కానుంది. ఈ క్రమంలో జనవరి 31వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో పుష్ప-2 (Pushpa 2 OTT) చిత్రం స్ట్రీమింగ్ కానుందనే వార్తలొస్తున్నాయి. వారం పది రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ విషయంపైన పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటించిన విషయం తెలిసిందే. సునీల్, జగపతి బాబు, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో సందడి చేశారు.







