NBK’s Unstopppable: బాలయ్య షోలో చెర్రీ సందడి.. లేటెస్ట్ ప్రోమో ఇదిగో!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar) డైరెక్షన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. సంక్రాంతి(Sankranti) కానుకగా ఈ సినిమా జనవరి 10న థియేటర్లలోకి రానుంది. టాలీవుడ్ ప్రోడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. SJ సూర్య విలన్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. అలాగే రెండ్రోజుల క్రితం రిలీజ్ అయిన ట్రైలర్(Trailer) సైతం సినిమాపై భారీ హైప్ పెంచేసింది. తాజాగా బాలయ్య ఆహా OTTలో హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ S4 (Unstoppable) షో చెర్రీ పాల్గొన్నాడు. దానికి సంబంధించి లేటెస్ట్ ప్రోమో(Promo) ఇవాళ విడుదలైంది. ఇందులో బాలయ్య, చెర్రీ ఫుల్‌గా సందడి చేశారు.

సరదా సరదాగా

ఆహా OTTలో బాలయ్య అన్‌స్టాపబుల్ షో సీజన్ 4(Unstoppable Season 4) సూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 8 ఎపిసోడ్స్ రాగా తాజాగా 9వ ఎపిసోడ్ ప్రొమో తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్‌కి ‘గేమ్ ఛేంజర్’ రామ్ చరణ్ వచ్చి సందడి చేశాడు. రామ్ చరణ్‌తో పాటు శర్వానంద్(Sharwanand), దిల్ రాజు, నిర్మాత విక్రమ్ కూడా వచ్చి అలరించారు. గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌(Game changer promotions)లో భాగంగా చరణ్ ఈ షోకి వచ్చారు. ఇక ఈ ఎపిసోడ్ అంతా సరదా సరదాగా సాగింది. ఈ ప్రోమో మీరూ చూసేయండి.

 

14న పార్టీ చేసుకుందాం: దిల్ రాజు

ఈ ప్రోమోలో.. చరణ్ తల్లి, నానమ్మ మాట్లాడిన వీడియో చూపించారు. 2025లో తమకు వారసుడు కావాలని కోరుకున్నారు. ఇక పార్టీకి తన మామయ్య అల్లు అరవింద్(Allu Aravind)తో వెళ్లడం ఇష్టమని చెప్పారు. కూతురు క్లీంకార(Klinkara) గురించి మాట్లాడాడు చరణ్. ఇదే షోలో అటు పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శర్వానంద్ కూడా వచ్చి చరణ్‌తో ఫ్రెండ్షిప్ గురించి పంచుకున్నాడు. ఉపాసన గురించి మాట్లాడాడు. ప్రభాస్‌(Prabhas)కి కాల్ చేసి మాట్లాడారు. దిల్ రాజు కూడా వచ్చి 14న పార్టీ చేసుకుందాం అన్నారు. చరణ్, బాలయ్య కలిసి గేమ్ ఛేంజర్ పాటకు డ్యాన్స్ వేశారు. మెగా-నందమూరి ఫ్యాన్స్(Mega-Nandamuri fans) ఎపిసోడ్ జనవరి 8వ తేదీ రాత్రి 7 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *