
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప-2’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గతేడాది డిసెంబరు 5వ తేదీన రిలీజై ప్రభంజనం సృష్టించింది. తెలుగులోనే కాకుండా.. హిందీ మార్కెట్లోనూ తన సత్తా చాటింది. ఇప్పటివరకు రూ.1800 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ఇక వరుస హిట్లతో పాన్ ఇండియా ఇమేజ్ ను దక్కించుకున్న అల్లు అర్జున్ పుష్ప-2 (Pushpa 2) తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడనే దానిపై అందరికీ ఆసక్తి నెలకొంది.
త్రివిక్రమ్-బన్నీ సినిమాకు బ్రేక్
ఈ క్రమంలోనే బన్నీ తన తదుపరి సినిమా.. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలతో హ్యాట్రిక్ తనకు హ్యాట్రిక్ ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. సోషియో మైథలాజికల్ ఫాంటసీ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ మహాశివుడి కుమారుడైన కార్తికేయుడి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాకు బ్రేక్ పడినట్లు తెలిసింది.
జవాన్ డైరెక్టర్ తో బన్నీ సినిమా
అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో చేయడం లేదట. ప్రస్తుతం ఈ సినిమాను బన్నీ పక్కన పెట్టేశాడట. పుష్ప-2 వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ‘జవాన్’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అట్లీ (Atlee)తో పని చేయాలని భావిస్తున్నాడట అల్లు అర్జున్. ఈ క్రమంలోనే అట్లీతో సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ సినిమాకు బన్నీ జస్ట్ బ్రేక్ ఇచ్చాడా.. లేక మొత్తానికే ఈ చిత్రాన్ని ఆపేశాడా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.