
టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam).. ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకుడుండడు. జబర్దస్త్ షోతో ఈ భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయమై కుర్రకారు గుండెల్లో తిష్ట వేసింది. మరోవైపు అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ వెండితెరపై సందడి చేస్తూ ఉంటుంది. ఎన్ని సినిమాలు చేసినా.. తనకు లైఫ్ ఇచ్చిన బుల్లితెరను మాత్రం వదిలిపెట్టదు. మరోవైపు సామాజిక సేవలోనూ ఈ భామ ముందుంటుంది. ముఖ్యంగా పశువులంటే ఈ బ్యూటీకి ప్రాణం. మూగజీవాలకు ఏమైనా జరిగితే వాటిని ఆదుకోవడంలో అందరికంటే ముందు ఉంటుంది.
అయితే తాజాగా రష్మీ గౌతమ్ (Rashmi Gautam Hospital) ఆస్పత్రిపాలైనట్లు సమాచారం. తన సోషల్ మీడియా ఖాతాలో ఈ బ్యూటీ షేర్ తాను హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటోలు షేర్ చేసింది. ‘నేను సర్జరీ కోసం రెడీ అయ్యాను. నా భుజాన్ని సెట్ చేసుకోవాల్సి ఉంది. దాని వల్ల నాకు ఇష్టమైన డాన్స్ చేయలేకపోతున్నా. ఈ సర్జరీ అయ్యాక అంతా సెట్ అవుతుంది. నేను నాకిష్టమైన డ్యాన్స్ చేయగలుగుతాను.’ అంటూ రష్మీ పోస్టు పెట్టింది. ఈ పోస్టు చూసిన రష్మీ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.