
టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), లేడీ సూపర్ స్టార్ సాయిపల్లవి (Sai Pallavi) నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘తండేల్’ (Thandel). చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే చిత్రం విడుదలైన రోజు నుంచి దీన్ని పైరసీ భూతం వెంటాడుతోంది. ఇప్పటికే ఆన్ లైన్ లో ఈ సినిమా HDప్రింట్ వైరల్ అవుతోంది. ఇక తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ఈ సినిమాను టెలికాస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ వార్నింగ్
ఈ ఘటనపై ఈ సినిమా నిర్మాతలు బన్నీ వాసు, అల్లు అర్వింద్ స్పందించారు. పైరసీ (Thandel Piracy)ని ప్రోత్సహిస్తోన్న వారిపై మండిపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ సంస్థ ఛైర్మన్‌కు రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ (APSRTC Chairman) కొనకళ్ల నారాయణరావు దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
బస్సులో తండేల్ టెలికాస్ట్ దారుణం
ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో తండేల్ పైరసీ ప్రింట్ (Thandel HD Print In Bus) ప్రదర్శించడం దారుణం. ఈ సినిమా సక్సెస్ ఆస్వాదించే సమయంలో ఇదొక ప్రతిబంధకం అయింది. కొందరు తెలిసి, మరికొందరు తెలియక ఇలా సినిమాల్ని పైరసీ చేస్తున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్‌లో ఆ లింక్స్‌ను ఫార్వర్డ్ చేస్తున్నారు. పైరసీ చేస్తున్న వారిని, దాన్ని ప్రోత్సహిస్తున్న వారిని గుర్తించి కేసులు పెడుతున్నాం. వాళ్లంతా జైలుకు వెళ్లే అవకాశముంది. యువతా జాగ్రత్త పైరసీ ప్రోత్సహించకండి. మీ భవిష్యత్తు పాడు చేసుకోకండి. అని నిర్మాతలు హెచ్చరించారు.