
‘వయ్యారి భామ నీ హంస నడక.. ఓ మిస్సమ్మా మిస్సమ్మా యమ్మా.. మేడ్ ఇన్ ఆంధ్రా స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా.. యే చికితా గుమాస్తా…’ ఈ పాటలన్నీ వింటుంటే అప్పట్లో యూత్ ను ఒక ఊపు ఊపేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సింగర్ రమణ గోగుల (Ramana Gogula) కాంబో గుర్తొస్తుంది కదూ. దాదాపు 17 ఏళ్ల పాటు రమణ గోగుల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇక ఇటీవలే వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో ‘గోదారి గట్టు (Godari Gattu Song)’ సాంగ్ తో రీఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు.
పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
ఇక ఆయన రీఎంట్రీ తర్వాత మళ్లీ ఒకసారి పవన్ కల్యాణ్, రమణ గోగుల కాంబినేషన్ లో సాంగ్ వస్తే బాగుంటుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని డైరెక్టర్ హరీశ్ శంకర్(Harish Shankar) కూడా ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ సినిమాకి రమణ గోగుల మరోసారి పని చేస్తే బాగుంటుందని కోరుకునే ఎంతో మందికి దర్శకుడు హరీశ్ శంకర్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh) అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే.
పవన్-రమణ గోగుల కాంబో రిపీట్
అయితే ఇందులో ఓ పాటను హరీశ్ శంకర్ రమణ గోగులతో పాడించాలని అనుకున్నారట. ఈ విషయాన్ని ఆయన సంక్రాంతికి వస్తున్నం సినిమా విక్టరీ వేడుకలో షేర్ చేసుకున్నారు. అయితే, ముందుగా ఆ ఛాన్స్‌ను ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ టీమ్ కొట్టేసిందని అన్నారు. ఇక హరీశ్ శంకర్ ఇచ్చిన అప్డేట్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. పవన్ కల్యాణ్, రమణ గోగుల కాంబో కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామంటూ నెట్టింట ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.