సమంతకు బిగ్ షాక్.. ‘సిటడెల్‌’ సీజన్‌-2 రద్దు

బాలీవుడ్ స్టార్ వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan), టాలీవుడ్ బ్యూటీ సమంత (Samantha) జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌ సిరీస్‌ ‘సిటడెల్‌: హనీ-బన్నీ’  ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించిన వెబ్‌ సిరీస్‌కి ఇండియన్‌ వెర్షన్‌గా ఇది రూపొందింది. దీని పార్ట్‌ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈ సిరీస్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది. సిటడెల్ సీజన్‌2ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

సమంతకు బిగ్ షాక్

ప్రియాంక నటించిన సిటడెల్‌ ఆధారంగానే ఇండియన్‌ వెర్షన్‌, ఇటాలియన్‌ వెర్షన్‌లు (Citadel: Diana) రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రెండింటి కొనసాగింపులను రద్దు చేస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. బదులుగా వీటిని మాతృకలో విలీనం చేయనున్నట్లు తెలిపింది.  ‘‘సిటడెల్‌: హనీ-బన్నీ (Citadel Honey Bunny), సిటడెల్‌: డయానా తదుపరి సీజన్లను నిలిపివేసి.. వాటి కొనసాగింపు కథలను మాతృకలో విలీనం చేస్తున్నట్లు వెల్లడించింది.

సిటడెల్ సీజన్-2 రద్దు

“సిటడెల్ సిరీస్‌ అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ అందుకుంది. మంచి సక్సెస్ చూసింది. ఇదో ఎమోషనల్ జర్నీ. మాతృకను మరింత గొప్పగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రెండు ప్రాజెక్టులను రద్దు చేస్తున్నాం.’’ అని అమెజాన్ ప్రైమ్ ప్రతినిధులు తెలిపారు. ఇక ప్రియాంక (Priyanka Chopra) నటిస్తోన్న ‘సిటడెల్‌ పార్ట్‌-2 (Citadel Part 2)’ 2026లో విడుదల  చేయనున్నట్లు వెల్లడించారు.

Related Posts

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Ram Pothineni: రామ్ కొత్త మూవీ గ్లిమ్స్ వచ్చేసింది.. మూవీ పేరు ఇదే..

రామ్ పోతినేతి (Ram Pothineni), భాగ్య శ్రీ బోర్సే (Bhagyashri Borse) కాంబోలో మహేశ్ బాబు.పి తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన సూపర్ అప్డేట్ వచ్చేసింది. రామ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ గ్లిమ్స్ను రిలీజ్ చేశారు. ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ (Andhra King…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *