Power Couple : ప్రజాక్షేత్రంలో ‘ఆయన’.. పదవి లేకున్నా ప్రజలకు అందుబాటులో ‘ఆమె’

Mana Enadu : ‘ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందన్నది నానుడి’. ఈ వ్యాఖ్య డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క(Bhatti Vikaramarka) – మల్లు నందిని (Mallu Nandini) దంపతులను చూస్తే నిజమేనని అనిపించకమానదు. రాజకీయ క్షేత్రంలో ముందుడి ప్రజల కోసం ఆయన పని చేస్తుంటే.. ఇటు ఇల్లును అటు కుటుంబాన్ని ఆయన వెనకుండి ఆయన సతీమణి నందిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కేవలం కుటుంబాన్నే కాదు.. నియోజకవర్గ ప్రజల కోసం ‘అమ్మ ఫౌండేషన్(Amma Foundation)’ ద్వారా ఎంతో మందికి తల్లయ్యారు.

అభాగ్యుల పాలిట వరంగా అమ్మ ఫౌండేషన్

రాజకీయ క్షేత్రంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి పదవి హోదాలో భట్టి విక్రమార్క ప్రజల కోసం సేవ చేస్తుంటే.. అమ్మ ఫౌండేషన్ ద్వారా మల్లు నందిని (Mallu Nandini Amma Foundation) కూడా ప్రజాసేవలో తన వంతు సాయం చేస్తున్నారు. అమ్మ ఫౌండేషన్ ఎంతో మంది అభాగ్యుల పాలిట వరంగా మారింది. ఈ సంస్థ ఎంతో మంది అనాథలను చేరదీసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది. మరెంతో మంది దివ్యాంగులు, వికలాంగులకు బాసటగా నిలుస్తోంది. ఈ ఫౌండేషన్ ద్వారా మల్లు నందిని.. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nandini Mallu (@nandini_mallu)

ప్రజా క్షేత్రంలో ఆయన.. ప్రజల వెంటనే ఆమె

గత అసెంబ్లీ ఎన్నికల్లో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ (People’s March) పేరుతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఆయన పాదయాత్రలో ప్రతి ఊరుకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటుంటే.. మరోవైపు మధిర నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారం పేరుతో భట్టి సతీమణి మల్లు నందిని ఓటర్లను ఆకట్టుకున్నారు.

అలా జిల్లాలో, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంలో భట్టికి నందిని చాలా మద్దతుగా నిలిచారు.  ఇలా దంపతులిద్దరు ప్రజాక్షేత్రంలో కలిసి మెలిసి ఓటర్ల మనసు గెలుచుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అమ్మ ఫౌండేషన్ ద్వారా మల్లు నందిని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. 

 

View this post on Instagram

 

A post shared by Nandini Mallu (@nandini_mallu)

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *