Mana Enadu : ఇటీవలే డీఎస్సీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరికొన్ని టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలోని 139 ఆర్మీ పబ్లిక్ స్కూళ్ల(Army Public Schools)లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రకటన రిలీజ్ చేసింది. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో.. సికింద్రాబాద్ (RKP) సికింద్రాబాద్ (Bollaram), గోల్కొండల్లో ఆర్మీ పబ్లిక్ స్కూళ్లు(Golconda Army Public School) ఉన్న విషయం తెలిసిందే.
బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్, జాగ్రఫీ, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్(Physics), సైకాలజీ, సంస్కృతం, ఫిజికల్ ఎడ్యుకేషన్ (Physical Education) సబ్జెక్టుల్లో ఉపాధ్యాయుల నియామకం జరగనుంది. 01.04.2024 నాటికి అనుభవం లేని వారు 40 ఏళ్ల లోపు, అనుభవజ్ఞులైతే 57 ఏళ్ల లోపు ఉండాలని ప్రకటనలో ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (Army Welfare Education Society) ప్రకటనలో పేర్కొంది. అర్హతలు ఉన్న వారు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకూ పోటీ పడొచ్చని తెలిపింది. ప్రతి పోస్టుకూ విడిగా దరఖాస్తు చేయాలని సూచించింది.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు సమయంలో అభ్యర్థులు మూడు పరీక్ష కేంద్రాలను ఎంచుకోవచ్చు.
- దరఖాస్తు ఫీజు: రూ.385.
- దరఖాస్తుకు చివరి తేదీ: 25.10.2024
- పరీక్ష తేదీలు: నవంబరు 23, 24
- ఫలితాల వెల్లడి: 10.12.2024
- వెబ్‌సైట్: http://www.awesindia.com/
1. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (PGT): పీజీ, బీఈడీ 50 శాతం మార్కులతో పాసవ్వాలి.
2. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT): గ్రాడ్యుయేషన్, బీఈడీ 50 శాతం మార్కులతో పాస్ అవ్వాలి.
3. ప్రైమరీ టీచర్ (PRT): గ్రాడ్యుయేషన్, రెండేళ్ల డీఈఐఈడీ/ బీఈఐఈడీ 50 శాతం మార్కులతో పాసవ్వాలి. లేదా బీఈడీ, ఆరు నెలల పీడీపీఈటీ/ బ్రిడ్జ్ కోర్సు 50 శాతం మార్కులతో పూర్తిచేయాలి.
ఎంపిక ఇలా
- ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్ (Teaching Skills), కంప్యూటర్ పరిజ్ఞానం, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. ఇందులో సబ్జెక్టు ఆధారిత ప్రశ్నలు అడుగుతారు.
- క్వశ్చన్ పేపర్ 200 మార్కులకు ఉండగా.. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కుంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు.
- మరోవైపు పీజీటీ పోస్టులకు క్వశ్చన్ పేపరులో మూడు సెక్షన్లు.. సెక్షన్-ఏలో బేసిక్ జీకే, కరెంట్ అఫైర్స్, సెక్షన్-బీలో పెడగాజి, కరిక్యులం-ఎడ్యుకేషన్ పాలసీ మేటర్స్, సెక్షన్-సీలో అకడమిక్ ప్రొఫిషియెన్సీ ప్రశ్నలు అడుగుతారు.
- టీజీటీ పోస్టులకు సెక్షన్-ఏలో బేసిక్ జీకే-కరెంట్ అఫైర్స్, సెక్షన్-బీలో పెడగాజి, కరిక్యులం-ఎడ్యుకేషన్ పాలసీ మ్యాటర్స్; సెక్షన్-సీలో అకడమిక్ ప్రొఫిషియన్సీ క్వశ్చన్లు ఇస్తారు.
- పీజీటీ పోస్టులకు సెక్షన్-ఏలో బేసిక్ జీకే-కరెంట్ అఫైర్స్; సెక్షన్-బీలో పెడగాజి, కరిక్యులం-ఎడ్యుయేషన్ పాలసీ మేటర్స్; సెక్షన్-సీలో అకడమిక్ ప్రొఫిషియన్సీ క్వశ్చన్స్ అడుగుతారు.