పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజై ప్రేక్షకుల్లో చిత్రంపై ఆసక్తిని పెంచేసింది.
మాట వినాలి సాంగ్
మాట వినాలి అనే పాటను మేకర్స్ ఇటీవల రిలీజ్ చేశారు. ఈ పాటను స్వయంగా పవన్ కల్యాణ్ పాడారు. తాజాగా దీనికి సంబంధించి బీటీఎస్ వీడియో కూడా విడుదల చేశారు. ఇక హరిహరవీరమల్లు నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. మేకర్స్.. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.
#HariHaraVeeraMallu Next Song #PawanKalyan Will Shake Legs With #PoojithaPonnada & #Anasuya In His Upcoming Song #GaneshMaster Choreography & #MMKeeravaani Music
Mothamogipoddi e song 💥💥 pic.twitter.com/s4rmhYuINS— Naveen Sana (@powerstarsana) January 30, 2025
పవర్ స్టార్ తో ఇద్దరు భామలు
ఈ పాటలో పవన్ కల్యాణ్ తో కలిసి ఇద్దరు భామలు స్టెప్పులు వేయనున్నారు. పవన్ కల్యాణ్‌తో పూజిత పొన్నాడ, అనసూయ భరద్వాజ్ (Anasuya Bhardwaj) డ్యాన్స్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని తాజాగా అనసూయ ఓ టీవీ రియాలిటీ షోలో చెప్పుకొచ్చింది. గబ్బర్ సింగ్ వంటి పాటకు కొరియోగ్రఫీ చేసిన గణేశ్ మాస్టర్ ఇప్పుడు ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేస్తున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
హరిహరవీరమల్లులో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) ఫీ మేల్ లీడ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్, దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






