ఒకే టైటిల్‌తో ఇద్దరు హీరోల సినిమాలు.. తగ్గేదెవరో?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒకే టైటిల్ తో సినిమాలు రావడం కొత్త కాదు. కానీ కొన్నిసార్లు మూవీ టైటిల్స్ వివాదాస్పదం అవుతూ వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. కోలీవుడ్ లో ఇద్దరు హీరోలు తమ సినిమాలను ఒకే రోజు ప్రకటించారు. ఇందులో వింతేముంది అంటారా..? ఆ రెండు సినిమాల టైటిళ్లు ఒకటి కావడమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

పరాశక్తి టైటిల్ వివాదం

కోలీవుడ్ లో ‘పరాశక్తి (Parasakthi)’ సినిమా టైటిల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిచ్చగాడు ఫేం విజయ్ ఆంటోని (Vijay Antony) తన 25వ సినిమా టైటిల్ ను బుధవారం రోజు ప్రకటించారు. అరుణ్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర టైటిల్ ను పరాశక్తి అని పెట్టారు. మరోవైపు అమరన్ ఫేం శివకార్తికేయన్ (Shiva Karthikeyan) కూడా బుధవారం రోజునే తన నెక్స్ట్ సినిమాను ప్రకటించాడు.  సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టైటిల్ ను కూడా పరాశక్తి అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

తగ్గేదెవరు?

ఇలా ఇద్దరు హీరోలు ఒకే రోజు తమ 25వ సినిమా టైటిల్ ను ఒకటే అనౌన్స్ చేయడంపై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  సౌత్‌ సినిమా ఛాంబర్‌లో ఎప్పుడో పరాశక్తి టైటిల్‌ను రిజిస్టర్ చేయించానని విజయ్‌ ఆంటోనీ ఓ నోట్‌ విడుదల చేశాడు. మరో వైపు తాము పరాశక్తి టైటిల్‌ను ఏవీఎం నిర్మాణ సంస్థ (AVM Productions) నుంచి తీసుకున్నట్టు సుధా కొంగర టీం కూడా ప్రకటించింది. మిగతా భాషల మాట అటుంచితే తెలుగు వెర్షన్‌లో సేమ్‌ టైటిల్‌ పెట్టడంతో ఇప్పుడు గందరగోళం నెలకొంది. మరి ఈ రెండు సినిమాలు ఇదే టైటిల్‌తో విడుదలవుతాయా..? లేక ఇద్దరు హీరోల్లో ఎవరైనా తగ్గుతారా..? అనేది చూడాలి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *