‘హరిహరవీరమల్లు’తో స్టెప్పులేసే భామలు వీళ్లే..!

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజై ప్రేక్షకుల్లో చిత్రంపై ఆసక్తిని పెంచేసింది.

మాట వినాలి సాంగ్

మాట వినాలి అనే పాటను మేకర్స్ ఇటీవల రిలీజ్ చేశారు. ఈ పాటను స్వయంగా పవన్ కల్యాణ్ పాడారు. తాజాగా దీనికి సంబంధించి బీటీఎస్ వీడియో కూడా విడుదల చేశారు. ఇక హరిహరవీరమల్లు నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. మేకర్స్.. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్  చేస్తున్న విషయం తెలిసిందే.

పవర్ స్టార్ తో ఇద్దరు భామలు

ఈ పాటలో పవన్ కల్యాణ్ తో కలిసి ఇద్దరు భామలు స్టెప్పులు వేయనున్నారు. పవన్‌ కల్యాణ్‌తో పూజిత పొన్నాడ, అనసూయ భరద్వాజ్‌ (Anasuya Bhardwaj) డ్యాన్స్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని తాజాగా అనసూయ ఓ టీవీ రియాలిటీ షోలో చెప్పుకొచ్చింది. గబ్బర్ సింగ్ వంటి పాటకు కొరియోగ్రఫీ చేసిన గణేశ్ మాస్టర్ ఇప్పుడు  ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేస్తున్నారని సమాచారం.  అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

హరిహరవీరమల్లులో ఇస్మార్ట్‌ భామ నిధి అగర్వాల్‌ (Nidhi Agarwal) ఫీ మేల్‌ లీడ్‌ గా నటిస్తున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్‌ యాక్టర్‌, దర్శక నిర్మాత అనుపమ్‌ ఖేర్‌, అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *