ManaEnadu: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ(Tollywood industry)లో ఎక్కడ చూసినా జానీ మాస్టర్(Jony master) కేసు గురించే చర్చ నడుస్తోంది. ఇప్పటికే జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణల(sexual allegations) కేసులో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే ఈ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు బయటికొస్తున్నాయి. చాలామంది బాధితురాలి(victim)కి మద్దతు ఇవ్వడం కోసం ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్లు ఈ విషయంపై స్పందించారు. సినీ పరిశ్రమలోని పెద్దలు సైతం బాధితురాలికి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇక ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా చెప్పేసే యాంకర్ అనసూయ(Anchor Anasuya) సైతం ఈ విషయంపై స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో ఒక స్టోరీ షేర్ చేసింది. ఇంతకీ అదేంటో చూద్దామా..
ఆ అమ్మాయినే అప్పుడే చూశా: అనసూయ
‘‘పుష్ప (Pushpa)’ సెట్స్‌లో ఆ అమ్మాయిని చూశా. తను చాలా టాలెంటెడ్. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఆమె ప్రతిభను ఏమాత్రం తగ్గించలేవు. బాధితురాలికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు(Sexual harassment) ఎదురైతే భయపడాల్సిన అవసరం లేదు. మనసులో దాచుకోకుండా వెంటనే బయటపెట్టాలి. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండాలి. ఇంతకాలంగా ఆ అమ్మాయి అనుభవిస్తుంది తలచుకుంటేనే చాలా బాధేస్తోంది. చాలామంది అమ్మాయిలు, ఆడవారు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కుంటున్నా కూడా బయటికి చెప్పకోడం లేదనే విషయం తలచుకుంటేనే చాలా కోపం, బాధ కలుగుతున్నాయి. అందుకే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొటున్న వారు వెంటనే నోరు తెరిచి మాట్లాడాలి, ఎదిరించాలి’’ అనసూయ పేర్కొన్నారు.
పరారీలో జానీ మాస్టర్?
ఇదిలా ఉండగా ఈ కేసులో మరో ట్విస్ట్(Twist) చోటు చేసుకుంది. తాజాగా జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు(POCSO case) నమోదు చేశారు. మైనర్(Minor)గా ఉన్నప్పటి నుంచి లైంగికంగా ఇబ్బందిపెట్టారన్న ఫిర్యాదుతో దాన్ని పోక్సో కేసుగా మార్చారు. తొలుత బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా, అక్కడ అత్యాచారం కేసుపై FIR నమోదైంది. ఆ తర్వాత దాన్ని నార్సింగి PSకు బదిలీ చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు సోషల్ మీడియా(Social media)లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై పోలీసుల నుంచి క్లారిటీ రావాల్సింది ఉంది.