ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju).. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే అనేక TV షోలలో యాంకరింగ్(Anchoring) ద్వారా ప్రతి ఇంటా ప్రదీప్ సందడి చేసిన చేసిన విషయం తెలిసిందే. ‘ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాతో వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్.. బాక్సాఫీస్(Box office) వద్ద సూపర్ విక్టరీ సాధించాడు. వసూళ్ల పరంగానూ ఈ మూవీ భారీ సక్సెస్ సాధించింది. ముఖ్యంగా ఈ మూవీలో ‘‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’’ అనే సాంగ్ ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ మదిలో మెదులుతూనే ఉంది. ఇక తాజాగా ప్రదీప్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో మరోసారి తన లక్‌ను పరీక్షించుకోనున్నాడు. దీపికా పిల్లి(Deepika Pilli) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 11న థియేటర్లలోకి రానుంది.

పొలిటిషియన్‌తో ప్రేమలో ఉన్నాడంటూ..
ఇదిలా ఉండగా ప్రదీప్‌కు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. బుల్లితెర యాంకర్‌గా, హీరోగా బాగా పాపులర్ అయిన ప్రదీప్ మాచిరాజు ఇప్పటికీ బ్యాచిలర్(Bachelor)గానే కంటిన్యూ అవుతున్నాడు. అయితే గత కొంత కాలంగా ప్రదీప్ పెళ్లి(Marriage) గురించి సోషల్ మీడియా(SM)లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రదీప్ ఓ పొలిటిషియన్(Politician)తో ప్రేమలో ఉన్నాడని, ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ప్రదీప్ తాజాగా స్పందించాడు.
ఇలాంటివి చాలా వచ్చాయ్..
తాను ప్రస్తుతానికి పెళ్లి గురించి ఎలాంటి ప్లాన్స్ చేసుకోలేదని, ఇప్పుడు తన టార్గెట్, ఫోకస్ మొత్తం కెరీర్(Career) పైనే ఉందన్నాడు. ముందు కెరీర్‌లో సెటిల్ అయి ఆ తర్వాతే మ్యారేజ్ లైఫ్‌లో సెటిల్ అవాలనుకున్నట్టు చెప్పాడు. ఇక పొలిటీషియన్‌తో పెళ్లి గురించి మాట్లాడుతూ తాను కూడా ఆ వార్తలు విన్నానని, అప్పట్లో రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ(Real Estate Family)కి చెందిన అమ్మాయితో తన పెళ్లి అన్నారని, ఇప్పుడు రాజకీయ నాయకురాలితో అంటున్నారని, తర్వాత ఏదొక క్రికెటర్(Cricketer)తో పెళ్లి అంటారేమో అని, అవన్నీ కేవలం రూమర్లేనని క్లారిటీ ఇచ్చాడు ప్రదీప్.






