AP BUDGET 2025-26 : శాఖల వారీగా కేటాయింపులు ఇవే

ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి వార్షిక పద్దు (AP Budget 2025-26)ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) శాసనసభలో, మరో మంత్రి కొల్లు రవీంద్ర శాసనమండలిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ.3.22 లక్షల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం వార్షిక పద్దును ప్రవేశపెట్టింది. ఇక రూ.48వేల కోట్లతో ప్రత్యేక వ్యవసాయ పద్దు (Agriculture Budget 2025)ను సమర్పించింది.

శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఇవే..

  1. మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు
  2. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు
  3. పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు
  4. ఉన్నత విద్యాశాఖకు రూ.2,506 కోట్లు
  5. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు
  6. పంచాయతీరాజ్‌ శాఖకు రూ.18,847 కోట్లు
  7. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862 కోట్లు
  8. గృహనిర్మాణ శాఖకు రూ.6,318 కోట్లు
  9. జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు
  10. పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు
  11. ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు
  12. ఆర్‌అండ్‌బీకి రూ.8,785 కోట్లు
  13. యువజన పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు
  14. గృహ మంత్రిత్వశాఖకు రూ.8,570 కోట్లు
  15. తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు
  16. మద్యం, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు
  17. అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు
  18. పోలవరం కోసం రూ.6,705 కోట్లు
  19. జల్‌జీవన్‌ మిషన్‌ కోసం రూ.2800 కోట్లు
  20. ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు
  21. ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు
  22. బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు
  23. అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లు
  24. తల్లికివందనం కోసం రూ.9,407 కోట్లు
  25. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల కోసం రూ.27,518 కోట్లు
  26. ఆర్టీజీఎస్‌ కోసం రూ.101 కోట్లు
  27. దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు
  28. మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు
  29. స్వచ్ఛాంధ్ర కోసం రూ.820 కోట్లు
  30. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు
  31. ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు
  32. పీపీపీ ప్రోత్సాహానికి రూ.2 వేల కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు
  33. రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,51,162 కోట్లు
  34. మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు
  35. రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు
  36. ద్రవ్యలోటు రూ.79,926 కోట్లు

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *