
దేశంలో బంగారం (Gold Price Today), వెండి ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి . ముఖ్యంగా పసిడి ధరలు మరికొన్ని రోజుల్లో లక్ష రూపాయల వరకు చేరుకునేలా ఉంది. పెరుగుతున్న పుత్తడి ధరలు చూసి సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. తమ ఇంట్లో శుభకార్యాలకు ఇక బంగారం కొనుగోలు చేయలేమని వాపోతున్నారు. అయితే నిన్నటి కంటే ఇవాళ దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు (Silver Price Today) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
స్వల్పంగా తగ్గిన ధరలు
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం రోజున రూ.88,800 ఉన్న 10 గ్రాముల బంగారం ధర ఇవాళ (శుక్రవారం) రూ.80 తగ్గి రూ.87,720కు చేరుకుంది. ఇక కిలో వెండి ధర గురువారం నాడు రూ.97,600 ఉండగా, నేటి (శుక్రవారం)కి రూ.1270 తగ్గి రూ.96,330 వద్ద అమ్ముడుపోతోంది. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దామా..
ఇవాళ్టి పసిడి, వెండి ధరలు..
- హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర రూ.87,720.. కిలో వెండి ధర రూ.96,330
- విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర రూ.87,720.. కిలో వెండి ధర రూ.96,330
- విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం ధర రూ.87,720.. కిలో వెండి ధర రూ.97,330
- ప్రొద్దుటూరులో 10 గ్రాముల బంగారం ధర రూ.87,720.. కిలో వెండి ధర రూ.97,330గా ఉంది.