
ఏపీలో కూటమి సర్కార్ తొలిసారిగా పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ (AP Annual Budget 2025-26)ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ఈ పద్దును ప్రవేశపెడుతున్నారు. మరోవైపు శాసనమండలిలో కొల్లు రవీంద్ర వార్షిక పద్దును సమర్పించారు. రూ.3.22 లక్షల కోట్లతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ బడ్జెట్ ను మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగానికి రూ.48 వేల కోట్లతో ప్రత్యేక పద్దు కేటాయించారు. ఇక వీజీఎఫ్ రూ.2 వేల కోట్ల కేటాయింపులు జరిపారు.
గత పాలనలో అంతా విధ్వంసం
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వ పాలన (YSRCP Govt) అంతా నిర్లక్ష్యం.. విధ్వంసమేనని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైందని తెలిపారు. 2024లో రాష్ట్ర ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్న పని అని వెల్లడించారు. సవాళ్లను అధిగమించడంలో చంద్రబాబు దిట్ట అని ప్రశంసించారు.
- రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,51,162 కోట్లు
- మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు
- రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు
- ద్రవ్యలోటు రూ.79,926 కోట్లు
- బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు
- ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు
- ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు
- అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లు