ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేడ్కర్ కాలనీకి చెందిన కాండ్రు శ్యామ్‌కుమార్ నందిగామలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదివాడు. గత ఏడాది ఆ కాలేజీలో చదివుతున్న క్రమంలో శ్యామ్‌కుమార్ స్నేహితులకు స్థానికంగా ఉండే మరో కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఓ యువకుడికి మధ్య గొడవ చోటుచేసుకుంది. గొడవ జరిగినప్పుడు ఆ యువకుడిపై శ్యామ్‌కుమార్ స్నేహితులు దాడికి పాల్పడ్డారు. దీనిని మనసులో పెట్టుకున్న సదరు యువకుడు అదును కోసం వేచిచూడసాగాడు. బుధవారం ఉదయం..
కొందరు ఆకతాయిలు దళిత యువకుడిని కారులో తిప్పుతూ నాలుగు గంటలపాటు నరకం చూపించారు. మంచినీళ్లు అడిగితే రోడ్డు మధ్యలో కారు ఆపి మూత్రం పోసి అవహేళన చేశారు. మొత్తం ఆరుగురు యువకులు ఈ కిరాతకానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అమానుష ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో బుధవారం రాత్రి (నవంబర్ 1) చోటుచేసుకుంది. బాధితుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేడ్కర్ కాలనీకి చెందిన కాండ్రు శ్యామ్‌కుమార్ నందిగామలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదివాడు. గత ఏడాది ఆ కాలేజీలో చదివుతున్న క్రమంలో శ్యామ్‌కుమార్ స్నేహితులకు స్థానికంగా ఉండే మరో కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఓ యువకుడికి మధ్య గొడవ చోటుచేసుకుంది. గొడవ జరిగినప్పుడు ఆ యువకుడిపై శ్యామ్‌కుమార్ స్నేహితులు దాడికి పాల్పడ్డారు. దీనిని మనసులో పెట్టుకున్న సదరు యువకుడు అదును కోసం వేచిచూడసాగాడు. బుధవారం ఉదయం ఆ యువకుడు తాను చదివిన కాలేజీలో సర్టిఫికెట్ తీసుకునేందుకు వచ్చాడు. ఈ సమయంలో శ్యామ్‌కుమార్‌కు, ఆ యువకుడికీ మధ్య మరోమారు వాగ్వాదం జరిగింది.
దీంతో యువకుడు తన తోటి స్నేహితులతో కలిసి పన్నాగం పన్నాడు. అనంతరం అదే రోజు రాత్రి 8.30 గంటల సమయంలో దళిత యువకుడైన శ్యామ్ కుమార్‌కు ఫోన్ చేసి శివసాయి క్షేత్రం సమీపంలో గొడవ జరుగుతోందని, త్వరగా అక్కడకు రావాలని కోరాడు. వెంటనే మరో స్నేహితుడితో కలిసి శ్యామ్ కుమార్ బైక్‌పై అక్కడికి వెళ్లాడు. అప్పటికే అద్దెకు తీసుకుని సిద్ధంగా ఉంచిన కారులోకి ఆరుగురు యువకులు శ్యామ్‌కుమార్‌ను బలవంతంగా కారులో ఎక్కించి గుంటూరు జిల్లా వైపు దూసుకెళ్లారు. బైక్‌పై అతని వెంట వచ్చిన స్నేహితుడు ఈవిషయాన్ని వెంటనే మిగతా స్నేహితులకు, పోలీసులకు తెలియజేశాడు