మన ఈనాడు: వాళ్లు చేసే అక్రమ వ్యాపారంలో పోలీసులకే మస్కా కొట్టేలా స్కెచ్ వేసి అడ్డంగా దోరికిపోయారు. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ పేరుతో ఉన్న బొలెరో వాహానంలో గంజాయి తరలిస్తూ ఉప్పల్ పోలీసులకు చిక్కారిలా..ప్రకాశం జిల్లాకు చెందిన కుంచాల శ్రీను 20ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లోని నాగోల్ ప్రాంతానికి వచ్చాడు. అప్పటి నుంచి తాపీ మేస్ర్తీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
సులుభంగా డబ్బు సంపాదించాలని అక్రమం వ్యాపారానికి దారులు వెతికాడు. ఈక్రమంలో సీలేరు నుంచి గంజాయి మహారాష్ర్టకి తరలిస్తూ గతంలోనూ పోలీసులకు పట్టుబడ్డాడు. కానీ ఈసారి పోలీసులకు చిక్కకుండా ఉండేలా స్కెచ్ వేశాడు. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ పేరుతో ఉన్న వాహానంలోనే గంజాయి రవాణాకు తెరలేపాడు. సీలేరు నుంచి హైదరాబాద్ సుమారు 400కీలోమీటర్లు జర్నీ చేసినా పోలీసులు గుర్తించలేదు. కానీ రాచకొండ పోలీసులు నిఘా ముందు ఇవేమి కుదరలేదు. ఎల్బీనగర్ ఎస్వోటీ, ఉప్పల్ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్ అడ్డంగా దోరికిపోయారు.
ఒక్కో ప్యాకెట్లో 2కేజీలు ఉండేలా 40బ్యాగ్‌లను వాహనంలో తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయి విలువ రూ.24లక్షల ఉంటుందని పోలీసులు వెల్లడించారు.