మన ఈనాడు:
రాత్రిపూట బస్టాండ్‌లో నిద్రపోయిన వివాహితపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రాత్రి 11 గంటల సమయంలో అమానూష ఘటన చోటుచేసుకుంది.
సీఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల మేరకు కేశంపేట మండలానికి చెందిన యువతి(20) ఆదివారం చేవెళ్లలో ఉంటున్న తన అక్క ఇంటికి వచ్చింది. ఆమె ఇంటికి తాళం వేసి ఉండటంతో మళ్లీ బస్టాండ్‌కు తిరిగొచ్చింది. అప్పటికే చీకటి పడటంతోపాటు బస్సులు ఆ సమయానికి లేకపోవడంతో అక్కడే నిద్రపోయింది.
చేవెళ్లకే చెందిన అనిల్ కుమార్, రాజు ఆ యువతిపై కన్నేశారు. ఆమెను అనుసరిస్తూ అక్కడికి చేరుకున్నారు. నిద్రపోతున్న యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.