Tdp Janasena Bjp Alliance |పొత్తులు, సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి ప్రకటన

Mana Enadu: ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చేలా.. సీట్ల సర్దుబాటు జరిగింది. రాష్ట్ర భవిష్యత్తు ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యతాంశంగా పరిగణిస్తూ భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలు జరిగాయి.

Tdp Janasena Bjp Alliance : ఏపీలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి ప్రకటన చేశాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయని తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ పురోగతి, అభివృద్ధి, రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామన్నాయని వెల్లడించాయి. భారతదేశం గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని ఆకాంక్షిస్తూ మన దేశ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నాయి.

”ఢిల్లీలో మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. అమరావతిలో సీట్ల సర్దుబాటుపై సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చేలా.. సీట్ల సర్దుబాటు జరిగింది. రాష్ట్ర భవిష్యత్తు ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యతాంశంగా పరిగణిస్తూ భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలు జరిగాయి. ఆయా పార్టీలు ఆ తర్వాత స్థానాల పేర్లను ప్రకటిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల అంచనాలను నెరవేర్చాలనే కోరికతో ముందుకు సాగుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు మా సామర్థ్యాల మేరకు సేవలందించే అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తారని విశ్వసిస్తున్నాం” అని ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి.
టీడీపీ-జనసేన-బీజేపీ పోటీ చేసే స్థానాలపై చంద్రబాబు ఎక్స్ లో పోస్టు పెట్టారు. ‘బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ.. టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ.. జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాయి. ఈ మేరకు మూడు పార్టీల మధ్య జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయి. రాష్ట్ర ప్రజలు ఈ కూటమికి ఆశీర్వాదాలు అందించాలని, సేవ చేయడానికి చారిత్రాత్మకమైన అధికారం అందించాలని కోరుతున్నా’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

కాగా.. పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి త్యాగం చేశారు. బీజేపీ పొత్తులోకి రావడంతో 3 అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ కోసం వదులుకున్నారు పవన్ కల్యాణ్. 24 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని జనసేన గతంలో వెల్లడించగా.. తాజాగా 21 స్థానాల్లోనే బరిలోకి దిగుతున్నట్లు తెలిపింది.
పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు 31 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు. ఇందులో 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుండగా.. జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్ స్థానాల్లో పోటీ చేయనుంది. కాగా.. ఏయే స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేస్తుంది అనేదానిపై స్పషత రావాల్సి ఉంది.

Share post:

లేటెస్ట్