ManaEnadu:రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ (BRS) పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పగా తాజాగా అదే బాటలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagende) కూడా ఉన్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో (Congress) చేరనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేడు దానం భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీపా దాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. దానం నాగేందర్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాగా దానం నాగేందర్ రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా మళ్లీ హస్తం గూటికి చేరుతున్నారు.
IND vs ENG: అతడి వల్లే ఓడిపోయాం: ఇంగ్లండ్ కోచ్ మెక్‌కల్లమ్
ఇంగ్లండ్ జట్టుకు పెట్టని గోడ ఎడ్జ్బాస్టన్లో టీమిండియా రికార్డు స్థాయి స్కోరు చేసి ఆ జట్టును మట్టికరిపించింది. ఫస్ట్ టెస్ట్ ఓటమికి రివెంజ్ తీర్చుకుంది. గిల్ సేన ఆల్రౌండర్ షోతో రెండో టెస్టులో 336 రన్స్ తేడాతో బ్రిటిష్ జట్టుపై (IND…