Mana Enadu: ఆస్ట్రేలియా విక్టోరియాలో హైదరాబాద్‌కు (Hyderabad)చెందిన చైతన్య దారుణ హత్యకు గురయ్యింది. మౌంట్ పొల్లాక్ రోడ్డు పక్కన ఓ చెత్తబుట్టలో చైతన్య మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాధితురాలు హైదరాబాద్-ఏఎస్‌రావు నగర్ వాసి. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ భర్త అశోక్ రాజ్ ను పోలీసులు ఆదేశించారు.
ఆస్ట్రేలియాలోని బక్లీ ఆఫ్ విక్టోరియాలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. రోడ్డు పక్కన ఉన్న చెత్తకుండీలో చైతన్య మాదగాని, అలియాస్ శ్వేత అనే హైదరాబాదీ మహిళ డెడ్‌బాడీ దొరికింది. చైతన్యను ఎవరో హత్య చేసినట్టుగా డెడ్‌బాడీ చూస్తుంటే అర్థమవుతుంది. అటు చైతన్య భర్తపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైతన్య భర్త తన 3 ఏళ్ల కొడుకుతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లిపోయాడని సమాచారం. బాధితురాలు హైదరాబాద్‌లోని ఏఎస్‌రావు నగర్ (AS RAO NAGAR)వాసిగా తెలుస్తోంది. చైతన్య భర్త పేరు అశోక్‌రాజ్. హైదరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు మాదగాని బాల్‌శెట్టిగౌడ్, మాధవి దంపతుల కుమార్తె చైతన్య.
చైతన్యను ఆమె నివాసంలోనే హత్య చేసి మృతదేహాన్ని చెత్తడబ్బాలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పాయింట్ కుక్‌లోని చైతన్య ఇంటి పొరుగువారు ఈ ఘటన గురించి తెలుసుకోని షాక్‌కు గురయ్యారు. చైతన్య ప్రేమగల మహిళగా చెబుతున్నారు. ఆమె సమాజంలోని ఇతరులతో ఫుడ్‌ని పంచుకోవడానికి ఇష్టపడతారని తెలిపారు. ఇక చైతన్యను దారుణంగా హత్య చేసిన ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.