RTC Bus | ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి

మన Enadu: ఖమ్మం జిల్లాలోని కామేపల్లిలో ఆర్టీసీ బస్సు (RTC Bus) సిబ్బందిపై ఓ ఆటో డ్రైవర్‌ దాడి చేశాడు. కామేపల్లి వద్ద ఆటోను పక్కకు పెట్టమని బస్సు డ్రైవర్‌ కోరాడు.

దీంతో ఆగ్రహానికి లోనైనా ఆటో నడుపుతున్న వ్యక్తి.. బస్సు డ్రైవర్‌పై దాడిచేశాడు. అడ్డుకునేందుకు యత్నించిన కండక్టర్‌ను కొట్టాడు. అంతటితో ఆగకుండా బస్సు అద్దాలను ద్వంసం చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ ఫిర్యాదుతో ఆటో డ్రైవర్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆటో డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు.

Share post:

లేటెస్ట్