మన Enadu: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది.
మృతులు హైదరాబాద్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.







