మన Enadu: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యాశ్రీ (23) గచ్చిబౌలిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. మార్చి 17న ఆమెకు వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. గురువారం ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్లాల్సి ఉండగా.. హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లో షవర్ రాడ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.