ప్రజెంట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల సంక్రాంతి పండక్కి విక్టరీ వెంకటేశ్(Venkatesh)తో వచ్చి ‘ సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో సూపర్ విక్టరీ అందుకున్నాడు. ఇక ఇదే ఊపులో మరో స్టార్ హీరోతో భారీ ప్రాజెక్టు చేయబోతున్నాడు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో భారీ ఎత్తున ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించి ఈ సమ్మర్ లోపు స్క్రిప్ట్ వర్క్(Script work) పూర్తి చేసి, సినిమా సెట్స్‌పైకి తీసుకురానున్నారట అనిల్. ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని అనిల్ ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించి ఓ కీలక సమాచారం బయటకొచ్చింది.
గెస్ట్ రోల్ మాత్రమే కాదు..
భారీ ఎత్తున రూపొందనున్న ఈ సినిమాలో హీరో విక్టరీ వెంకటేశ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. వెంకీ-చిరు కాంబోలో వచ్చే ఈ సీన్స్ థియేటర్ దద్దరిల్లేలా ఉంటాయని సమాచారం. అయితే వెంకీది కేవలం గెస్ట్ రోల్(Guest Role) మాత్రమే కాదని, చాలా ప్రాధాన్యమున్న పాత్ర అని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అటు వెంకీ అభిమానులు(Venky Fans), ఇటు చిరంజీవి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కథ చెబుతున్నంత సేపు చిరు నవ్వుతూనే..
మంచి మెసేజ్ పాయింట్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కథతో రూపొందనుందని తెలుస్తోంది. చిరంజీవి కామెడీ యాంగిల్స్‌తో థియేటర్స్ హోరెత్తిపోయేలా అనిల్ ప్లాన్ చేస్తున్నారట. పైగా చిరంజీవి డ్యూయెల్ రోల్‌లో నటించనున్నారనే మరో టాక్ కూడా నడుస్తోంది. ఇటీవల ఓ ఈవెంట్‌లో మెగాస్టార్ దీనిపై మాట్లాడుతూ.. అనిల్ కథ చెబుతున్నంత సేపు నవ్వుతూనే ఉన్నానని చెప్పారు. అనిల్‌తో వర్క్ చేయడం కోదండరామి రెడ్డి(Kodanda Ramireddy)తో పనిచేసిన అనుభూతిని గుర్తు తెచ్చిందన్నారు. కాగా ఈ చిత్రాన్ని సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల(Sushmita Konidela) సంయుక్తంగా నిర్మించనున్నారు.









