
నందమూరి కళ్యాణ్ రామ్(Kalyanram), లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijayashanthi) ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త మూవీ “అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun S/o Vyjayanthi)”. సాయీ మంజ్రేకర్(Saiee Majrekar) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సొహైల్ ఖాన్(Sohal Khan) విలన్‌గా నటించాడు. ప్రదీప్ చిలుకూరి(Director Pradeep Chilukoori) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతోంది. టీజర్(Teaser)తోనే బిజినెస్ బూస్టప్ తెచ్చుకుందీ మూవీ. ఇక రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్(Trailer)తో బ్లాక్‌బస్టర్ లుక్ వచ్చేసింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో NTR చెప్పిన మాటలు సినిమా రేంజ్‌ను మార్చాయి. చివరి 20 నిమిషాలు ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటారని చెబుతూ.. తనే కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేయడంతో మూవీ విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.
కళ్యాణ్ రామ్ మరో బ్లాక్‌బస్టర్ కొడతాడా?
ఇక “సరిలేరు నీకెవ్వరు” తర్వాత విజయశాంతి ఈసారి చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. పైగా పోలీస్(Police Character) పాత్రలంటే ఆమెకు టైలర్ మేడ్. అలాంటి రోల్‌లోనూ గతంలోలాగే పవర్ ఫుల్‌గా కనిపిస్తోంది. తల్లి, కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంతో తెరకెక్కిన అర్జున్ సన్నాఫ్ వైజయంతికి ఈ రెండు పాత్రలూ చాలా కీలకం కాబోతున్నాయి.
ఇక తాజాగా ఈ మూవీ సెన్సార్(Censor) పూర్తయింది. సెన్సార్ బోర్డు నుంచి ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ వచ్చింది. మూవీ రన్ టైం 2:24 గంటలుగా ఉంది. మరి కళ్యాణ్ రామ్ ఈసారి మరో బ్లాక్‌బస్టర్ కొడతాడా? లేదా? అనే తెలియాలంటే మరో 4 రోజులు ఆగాల్సిందే.