Anil Ravipudi: 10ఏళ్లలో ఒక్క ఫ్లాప్ కూడా లేదు.. అనిల్ రావిపూడి ఏమ్ ఇదే!

ఈరోజుల్లో సినిమా తీయాలంటే మినిమం బడ్జెట్ రూ.100 కోట్లు ఉండాల్సిందే. పైగా అభిమానుల్లో అంతటి క్రేజ్ ఉన్న హీరో అయి ఉండాలి. దాదాపు డైరెక్టర్లందరూ పాన్ ఇండియా(Pan India)వైపు అడుగులు వేస్తున్నవారే. అందుకు తగ్గట్లూ ప్రొడ్యూసర్లూ వెనక్కి తగ్గేదేలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాలో ఓ పాటను దాదాపు రూ.75కోట్లు వెచ్చించి మీర తెరకెక్కించారు. అలాంటి తరుణంలో కేవలం రూ.55 కోట్లు పెట్టి మూవీ తీసి బాక్సాఫీస్(Box Office) వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. ఇపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ డైరెక్టర్ ఎవరో.. అదేనండి ఈ సంక్రాంతి పండగక్కి ‘‘సంక్రాంతికి వస్తున్నాం’’తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందించాడు ఈ ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi).

వారం రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్

పటాస్(Patas) సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అనిల్ రావిపూడి అతి తక్కువ సమయంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా నిలిచాడు. ఆయన దర్శకుడిగా మారి 10 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అనిల్ మీడియాతో పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. పటాస్‌తో మొదలుపెట్టి ఇటీవల రిలీజ్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam)’ సినిమాతో 8 సినిమాలు పూర్తయ్యాయి. 10 ఏళ్ల వ్యవధిలో ఎనిమిది సినిమాలు ఫ్లాప్ లేకుండా పూర్తి చేయడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే ఆయన ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. వారం రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు(Gross Collections) కరెక్ట్ చేసి రీజినల్ సినిమాల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

ఆ స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే లక్ష్యం

ఇక తన కెరీర్‌లో బిగ్గెస్ట్ కాంప్లిమెంట్(Biggest compliment) ఏంటని మీడియా అడగగా.. దానికి అనిల్ సమాధానం ఇస్తూ ‘‘తన జీవితంలో ఇది బెస్ట్ EVV లాంటి లెజెండరీ డైరెక్టర్‌తో నన్ను పోల్చడం. అది కూడా చిన్నప్పుడు నేను ఆయన సినిమాలను ఎంతో ఎంజాయ్ చేసేవాడిని. దాన్ని నేను జీవితంలోనే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్‌గా తీసుకుంటాను’’ అంటూ అనిల్ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికే తాను నందమూరి బాలకృష్ణ(NBK), వెంకటేష్‌(Venkatesh)లతో సినిమాలు చేశానని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో కూడా సినిమా పట్టాలెక్కబోతోందని అన్నారు. నాగార్జున(Nagarjuna) గారితో కూడా 100% సినిమా చేస్తానని ఒకప్పుడు సినిమా పరిశ్రమకు ఫోర్ పిల్లర్స్‌గా చెప్పుకొని సీనియర్ హీరోలతో చేసిన అతి తక్కువ మంది డైరెక్టర్లలో తాను కూడా ఒకడిగా నిలవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డైరెక్టర్.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *