మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) పుట్టినరోజు (ఆగస్టు 22) (August 22) మెగా అభిమానులకు ఎప్పుడూ పండుగే. ఈ ఏడాది కూడా అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ‘బర్త్‌డే మంత్’ అంటూ సోషల్ మీడియాలో కామన్ డీపీతో హంగామా మొదలుపెట్టారు. మరోవైపు, చిరంజీవి నటిస్తున్న సినిమాలపై కూడా అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ ఉంది. పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాల నుంచి స్పెషల్ అప్‌డేట్స్ వస్తాయని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే, అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 157 (వర్కింగ్ టైటిల్: చిరు అనిల్) నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఫస్ట్ లుక్, టైటిల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుండగా, ఆగస్టు 22న మెగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
అనిల్ రావిపూడి తన సోషల్ మీడియాలో “ఆగస్టు 22 త్వరగా రా” అని పోస్ట్ చేస్తూ, ‘దొంగమొగుడు’ సినిమాలోని చిరంజీవి క్లిప్పింగ్‌ను షేర్ చేశారు. దీనికి చిత్ర బృందం స్పందిస్తూ, “Mega157 నుంచి మెగా సర్‌ప్రైజ్‌కి సిద్ధంగా ఉండండి. అనిల్ రావిపూడి స్టైల్‌లో మెగాస్టార్ చిరంజీవిని చూడబోతున్నారు” అని తెలిపింది. ఈ అప్‌డేట్‌తో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి.
అదే సమయంలో, ‘చిరు అనిల్’ 2026 సంక్రాంతికి విడుదల కానుందని కూడా మరోసారి కన్ఫర్మ్ చేశారు. మెగాస్టార్ పుట్టినరోజున రాబోయే ఈ అప్‌డేట్ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేయనుంది. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో చిరంజీవి ఎలా అలరిస్తారో చూడాలని మెగా ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
August 22nd త్వరగా…. ….
❤️🔥🔥🔥🔥💥#Mega157 pic.twitter.com/GXUXl8PTNX— Anil Ravipudi (@AnilRavipudi) August 8, 2025






