Special OPS 2: ఓటీటీలోకి మరో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ స్పెషల్ ఓపీఎస్-2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇటీవల ఓటీటీ (Over-The-Top) ప్లాట్‌ఫామ్‌ల ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది. ఇవి సంప్రదాయ మీడియాను మార్చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్(Netfilx), అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, జియో సినిమా వంటి OTTలు ఇంటర్నెట్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా స్మార్ట్‌ఫోన్, టీవీ, టాబ్లెట్‌లలో విసృత కంటెంట్‌ను ఆడియన్స్‌కు అందిస్తూ దూసుకెళ్తున్నాయి. సినిమాలు(Movies), వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, లైవ్ స్పోర్ట్స్(Sports), ప్రాంతీయ కంటెంట్‌తో సగటు ప్రేక్షకుడిని కట్టిపడేస్తున్నాయి. దీంతో సినిమా థియేటర్ల హవా రోజురోజుకీ తగ్గుతోందనేది కాదనలేని నిజం. తాజాగా మరో యాక్షన్ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది.

స్పెషల్ ఆప్స్ S2: కే కే మీనన్ హిమ్మత్ సింగ్‌గా తిరిగి వచ్చాడు; ప్రకాష్ రాజ్, తాహిర్ భాసిన్ కరణ్ టాకర్, సయామి ఖేర్‌తో చేరారు | వినోద వార్తలు ...

స్పై యాక్షన్ థ్రిల్లర్లపై ఓటీటీల ఫోకస్

ఓటీటీల్లో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు.. స్పై యాక్షన్ థ్రిల్లర్లు(Spy action thrillers) ఎక్కువగా కనిపిస్తాయి. భారీ బడ్జెట్‌తో డిఫరెంట్‌గా డిజైన్ చేసిన యాక్షన్ సన్నివేశాలతో ఈ సిరీస్‌లు అలరిస్తూ ఉంటాయి. అందువల్ల ఈ తరహా కంటెంట్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ఓటీటీ సంస్థలు ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతున్నాయి. అలా స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన సిరీస్‌లలో ఒకటిగా ‘Special Ops 2’ కనిపిస్తుంది. 2020లో వచ్చిన ‘Special OPS’ కీ 2021లో వచ్చిన ‘స్పిన్ ఆఫ్ స్పెషల్ ఓపీఎస్ 1.5’కి ఇది సీక్వెల్.

సైబర్-టెర్రరిజం అనే కథాంశంతో..

గతంలో వచ్చిన ఎపిసోడ్స్‌కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో సీజన్ 2 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సీజన్ 2ను జులై 11వ తేదీ నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. సీజన్-2 సైబర్-టెర్రరిజం(Cyber-terrorism) అనే కథాంశంతో కొనసాగనుంది. గూఢచారి హిమ్మత్ సింగ్‌గా మరోసారి కేకే మీనన్(KK Menon) కనిపించనున్నారు. నీరజ్ పాండే(Neeraj Pandey) దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సిరీస్‌లో, ప్రకాశ్ రాజ్(Prakash Raj), తాహిర్ బాసిన్, సయామీ ఖేర్, ముజమిల్ ఇబ్రహీం, తోతారాం చౌదరి ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సిరీస్ ఏ స్థాయిలో ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుందనేది చూడాలి మరి.

Related Posts

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

BIGG BOSS-S9: బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెల 7 బిగ్‌బాస్-9 షురూ

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *