ఆస్ట్రేలియా(Australia) రాజకీయాల్లో ఆంథోనీ ఆల్బనీస్(Anthony Albanese) మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. శనివారం (మే 3) జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో(General Elections) ఆయన నేతృత్వంలోని లేబర్ పార్టీ(Labor Party) స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధించింది. దీంతో ఆంథోనీ ఆల్బనీస్ వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా ప్రధాని(Australia prime minister) గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విజయంతో, 2004 సంవత్సరం తర్వాత వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తొలి ప్రధానిగా ఆంథోనీ ఆల్బనీస్ ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు.
🇦🇺 | Partido Trabalhista da Austrália, de centro-esquerda e liderado pelo atual primeiro-ministro Anthony Albanese, vence as eleições federais do país, derrotando principalmente a coalizão Liberal/Nacional, encabeçada pelo candidato de centro-direita Peter Dutton.
Albanese, que… pic.twitter.com/CQaUcVKlv4
— OHF News (@OHFNews) May 3, 2025
దీంతో ఆయన మరో మూడేళ్ల పాటు దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా ఆస్ట్రేలియా ప్రతినిధుల సభలోని మొత్తం 150 స్థానాలకు శనివారం పోలింగ్ జరిగింది. ఇందులో లేబర్ పార్టీ(Labor Party) ఇప్పటికే 86 స్థానాలను కైవసం చేసుకుని, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 76 స్థానాల మెజారిటీ మార్కును సునాయాసంగా అధిగమించింది.
ప్రధాని మోదీ అభినందనలు
ఆంథోనీ ఆల్బనీస్ విజయం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్(X)లో అభినందనలు తెలియజేశారు. “ఆస్ట్రేలియా ప్రధానిగా మరోసారి ఎన్నికైన మీకు అభినందనలు. ఈ అఖండ విజయం మీ నాయకత్వంపై ఆస్ట్రేలియా ప్రజల విశ్వాసానికి నిదర్శనం. భారత్-ఆస్ట్రేలియా(India-Australia) సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, ఇండో-పసిఫిక్ ప్రాంతం(Indo-Pacific region)లో శాంతి, సుస్థిరతల కోసం కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను” అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.









