Anupama: అనుమప-శర్వానంద్ కాంబోలో మరో మూవీ!

తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ల‌లో మ‌ల‌యాళ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్(Anupama Parameswaran) ఒక‌రు. అ..ఆ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన అనుప‌మ త‌ర్వాత ప‌లు సినిమాల్లో న‌టించి మెప్పించింది. ‘శ‌త‌మానం భ‌వ‌తి(Shatamanam Bhavathi)’ సినిమాతో ప‌క్కింటి అమ్మాయి పేరును సంపాదించుకుంది మ‌ల‌యాళ కుట్టీ. ఈ అమ్మడు మరోసారి శ‌ర్వానంద్‌(Sharwanand)తో జతకట్టనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వీరిద్దరూ కలిసి నటించిన శతమానం భవతి సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ చాలా వర్కవుటైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత అనుమప మళ్లీ శర్వానంద్‌తో కలిసి సినిమా చేయలేదు.

Suresh (@Suresh02508445) / X

త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్

ఈ నేప‌థ్యంలోనే మ‌ళ్లీ ఈ జంట ఇన్నేళ్ల‌కు క‌లిసి నటించబోతున్న‌ట్టు తెలుస్తోంది. శ‌ర్వానంద్ హీరోగా సంప‌త్ నంది(Sampath Nandi) ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే. ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను సెలక్ట్ చేశార‌ని స‌మాచారం. రీసెంట్‌గా చిత్ర బృందం ఈ విష‌య‌మై అనుప‌మ‌ని క‌లిసిన‌ట్టు తెలుస్తోంది. ఇందుకు ఈ మలయాళి భామ సుముఖుంగానే ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వీలుంది.

Shatamanam Bhavati surprises Biggies with its TRPs - Telugu360

ఆ మూవీ తర్వాతే కొత్త ప్రాజెక్టు

కాగా రీసెంట్‌గా అనుప‌మ న‌టించిన ‘రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్(Return of the Dragon)’ సూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. ఈ మూవీలో అనుప‌మ చిన్న పాత్ర‌లోనే క‌నిపించిన‌ప్ప‌టికీ త‌న న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. దీంతో టాలీవుడ్ ఫోక‌స్ మొత్తం మ‌ళ్లీ అనుప‌మ వైపు మ‌ళ్లింది. ప్ర‌స్తుతం ‘‘నారీ నారీ న‌డుమ మురారీ’’ సినిమాతో పాటూ అభిలాష్(Director Abhilash) ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న శ‌ర్వానంద్ త్వ‌ర‌లోనే సంప‌త్ మూవీని పట్టాలెక్కించనున్నాడు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *