అడివి శేష్ ‘DACOIT’లో మరో బాలీవుడ్ యాక్టర్

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్ – ఒక ప్రేమ కథ (Dacoit)’ అనేది ట్యాగ్ లైన్.  పాన్-ఇండియా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ భాగమైన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో హిందీ నటుడు ఈ ప్రాజెక్టులో నటిస్తున్నట్లు ఈ చిత్రబృందం అప్డేట్ ఇచ్చింది.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) డెకాయిట్ లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అనురాగ్ అయ్యప్ప స్వామి వస్త్రాలు ధరించి నుదుట బొట్టు మెడలో మాలతో కనిపించారు.

ఇన్‌స్పెక్టర్‌ స్వామి

మరోవైపు ఈ పోస్టర్ ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన అనురాగ్.. అవినీతిని సహించని, ధైర్యవంతుడు, అయ్యప్ప భక్తుడు అయిన స్వామి అనే ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో నేను అడివి శేష్ డెకాయిట్ సినిమాలో నటిస్తున్నాను. షూటింగు జరుగుతోంది. అని క్యాప్షన్ రాసుకొచ్చారు.

ఇక ఈ పోస్టర్ ను షేర్ చేసిన అడివి శేష్.. దీక్షలో ఉన్న పోలీస్ నన్ను పట్టుకుంటాడు అట.. నన్ను పట్టుకోవాలంటే ఆ దేవుడే దిగి రావాలి. మీకు దేవుడిపై విశ్వాసం ఉంది. నాకు నాపై నమ్మకం ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేస్తోంది.

రెండు భాషల్లో ఒకేసారి షూటింగ్

ఇక డెకాయిట్ సినిమా సంగతికి వస్తే ఇందులో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటిస్తోంది.  ఇప్పుడు అనురాగ్ కూడా హిందీ పరిశ్రమకు చెందిన వారే కావడంతో ఈ సినిమా బాలీవుడ్ మార్కెట్ పై కాస్త ఎక్కువ ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది.

షనీల్ డియో (Shaneil Deo) డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. మరో నిర్మాత సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇక ఈ సినిమా హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటోంది. దీనికి కథ, స్క్రీన్ ప్లే అడివి శేష్, షనీల్ డియో సంయుక్తంగా అందించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *