శ్రీ విష్ణు బ‌ర్త్‌డే స్పెష‌ల్.. కొత్త సినిమాల అప్డేట్స్

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన స్వాగ్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. పెద్దగా కలెక్షన్లు రాబట్టేలేదు. ఇక మరో హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడు ఈ యంగ్ హీరో. ఇవాళ పుట్టిన రోజు సందర్భంగా శ్రీవిష్ణు లేటెస్ట్ చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చేశాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దామా..?

‘సామజవరగమన’ మూవీతో సూపర్ ఫన్ పంచినశ్రీ విష్ణు – రెబా మోనిక జాన్‌ జంట మరోసారి ప్రేక్షకులను నవ్వించేందుకు రెడీ అయింది. ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా మృత్యుంజయ్ (Mrithyunjay). ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాను హుస్సేన్‌ షా కిరణ్ తెరకెక్కిస్తున్నాడు. నేడు శ్రీవిష్ణు బ‌ర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. సందీప్‌ గుణ్ణం, వినయ్‌ చిలకపాటి నిర్మిస్తున్న ఈ మూవీకి కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇక బర్త్ డే సందర్భంగా శ్రీవిష్ణు మరో సినిమాను ప్రకటించాడు. ప్రొడక్షన్ నంబర్ 3 (Production No 3) పేరుతో కొత్త సినిమాను అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.  ఈ పోస్టర్ లో హోండా CD100 బైక్ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌కు గెట్ ఇన్ ఫర్ ఏ క్రేజీ రైడ్, నో బ్రేక్స్, జస్ట్ లాఫ్స్ అనే క్యాచీ టైటిల్ యాడ్ చేసిన మేకర్స్ ఈ మూవీ  కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుమంత్ నాయుడు, సుబ్రహ్మణ్య నాయుడు, రామచారి ఎమ్ కలిసి నిర్మిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *