టాలీవుడ్ హీరోయిన్స్ తమన్నా (Tamannaah), కాజల్ (Kajal Agarwal) ఓ వివాదంలో చిక్కుకున్నారు. పుదుచ్చేరిలో క్రిప్టో కరెన్సీ స్కామ్లో ఈ ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయి. ఈ కేసులో పోలీసులు పలువురిని అరెస్టు చేసి విచారించగా.. దాదాపు రూ. 60 కోట్ల మేర స్కామ్ జరిగినట్టు గుర్తించారు. అయితే ఈ కేసు ఇప్పడు తమన్నా, కాజల్ అగర్వాల్ మెడకు చుట్టుకుంది. ఇందులో భాగంగా ఈ ఇద్దరు హీరోయిన్లను పోలీసులు విచారించనున్నారు.
క్రిప్టో కరెన్సీ స్కామ్
క్రిప్టో కరెన్సీ (Crypto Currency Scam) ద్వారా అధిక లాభాలు ఇస్తానని కొందరు 3.50 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారని పుదుచ్చేరి చెందిక ఆశోకన్ అనే ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పుదుచ్చేరి పోలీసులు నీతీష్ జైన్, అరవింద్ కూమార్ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. విచారణలో పుదుచ్చేరి లో మాత్రమే కాకుండా చెన్నై, కోయంబత్తూరు, ఏపీలోను ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు గుర్తించారు.
తమన్నా, కాజల్ పై కేసు
మరోవైపు క్రిప్టోకరెన్సీ కి సంబంధించి 2022లో కోయంబత్తూరు జరిగిన లాంఛింగ్ ఈవెంట్లో హీరోయిన్స్ తమన్నా,కాజల్ అగర్వాల్ పాల్గొన్నారు. వారు దీనికి ప్రమోటర్లుగా ఉండటం వల్ల ఈ మోసంలో వాళ్లకు కూడా భాగస్వామ్యం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారిని విచారించాలని నిర్ణయించారు. ఈ ఈవెంట్లో పాల్గొన్నందుకు వారికి డబ్బులు ఎలా ఇచ్చారు అనే వివరాలను సేకరించనున్నారు.






