
ఏపీలో కూటమి ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్ (AP Budget 2025-26)ను ఇవాళ (ఫిబ్రవరి 28వ తేదీ) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. దాదాపు 3, 24,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ పద్దును సమర్పించనుంది. 2025-26 వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం ఉదయం 9 గంటలకే అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌కు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రతులు అందించారు.
పద్దుకు కేబినెట్ ఆమోదం
ఈ నేపథ్యంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం (AP Cabinet) 2025-26 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఇక కాసేపట్లో శాసనసభలో మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ (Agriculture Budget 2025)ను అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, మండలిలో నారాయణ సమర్పిస్తారు. అంతకుముందు బడ్జెట్ ప్రతులతో అమరావతిలోని వెంకటాయపాలేనికి ఆర్థికమంత్రి పయ్యావుల చేరుకున్నారు. అక్కడ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకుని.. 2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు.