ఏపీ బడ్జెట్​కు వేళాయే.. ఈసారి అధిక ప్రాధాన్యత వీటికే!

ఏపీ బడ్జెట్ సమావేశాల్లో (AP Assembly Sessions 2025) భాగంగా శుక్రవారం రోజున ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో 2025-26 ఆర్థిక ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దాదాపు రూ.3.20 లక్షల కోట్ల మేర ఈ పద్దు (AP Budget 2025) ఉండనున్నట్లు సమాచారం. సూపర్ సిక్స్ లాంటి సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ పద్దులో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిసింది. ప్రత్యేకించి స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా బడ్జెట్​ రూపొందించినట్లు సమాచారం.

ప్రత్యేకంగా వ్యవసాయ పద్దు

2025-26 వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం శుక్రవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్​లో సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీ తర్వాత 10 గంటలకు శాసనసభలో మంత్రి పయ్యావుల పద్దు ప్రవేశపెడతారు. ఇక శాసన మండలిలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ వేశపెట్టనున్నారు. బడ్జెట్ అనంతరం ప్రత్యేకంగా వ్యవసాయ పద్దు (Agriculture Budget 2025)​ను శాసనసభలో మంత్రి అచ్చెన్నాయుడు..  మండలిలో మంత్రి నారాయణ ప్రవేశపెడతారు.

అందరికీ లబ్ధి చేకూర్చే బడ్జెట్

కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో సర్కార్ అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా కేటాయింపులు చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుల (Polavaram Project)తో పాటు రాష్ట్రంలోని ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం పెద్ద మొత్తంలో పద్దు కేటాయించినట్లు తెలిసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *