సరస్వతీ అలంకారంలో దుర్గమ్మ.. కుమార్తెతో కలిసి దర్శించుకున్న పవన్ కల్యాణ్

Mana Enadu : దేశ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు (Devi Navaratri Utsavalu) కన్నులపండువగా సాగుతున్నాయి. పలు ఆలయాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. పెద్ద ఎత్తున జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలకు భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుంటూ ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటున్నారు. దేవీ శరన్నవరాత్రులతో దేశమంతా సందడిగా మారింది.

ఇంద్రకీలాద్రిపై కోలాహలం

ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇంద్రకీలాద్రిపై (Kanaka Durga Temple) శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు మూలా నక్షత్రం (Moola Nakshatram) కావడంతో దుర్గమ్మను సరస్వతీ దేవి రూపంలో అర్చకులు అలంకరించారు. సరస్వతీ దేవి కటాక్షం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది.

కుమార్తెతో దుర్గమ్మ దర్శనానికి పవన్ కల్యాణ్

మరోవైపు దుర్గమ్మను సాధారణ భక్తులతో పాటు పలువురు ప్రముఖులు కూడా దర్శించుకుంటున్నారు. ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అమ్మవారిని దర్శించుకున్నారు. కుమార్తె ఆద్య (Aadhya Konidela)తో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న పవన్‌కు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

దుర్గమ్మ సన్నిధిలో సందడి

అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వారికి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటం అందజేశారు. పవన్‌తోపాటు హోంమంత్రి అనిత (Home Minister Anitha), ఎంపీ కేశినేని శివనాథ్‌ అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు మరో మంత్రి నిమ్మల రామానాయుడు దుర్గమ్మ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రికి భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Share post:

లేటెస్ట్