గుడ్ న్యూస్.. మద్యం టెండర్ల గడువు పెంచిన సర్కార్

Mana Enadu : ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల (Wine Shop License)కు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటున్న వారికి ప్రభుత్వ తీపి కబురు చెప్పింది. ఇవాళ్టి (బుధవారం)తో ముగియనున్న దరఖాస్తుల స్వీకరణ గడువును మరో రెండ్రోజులు పొడిగించింది. మొదట జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈ గడువు బుధవారం (అక్టోబర్ 9వ తేదీ)తో ముగియాల్సింది. అయితే అర్జీదారుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం వరకు గడువు పెంచుతున్నట్లు ఎక్సైజ్‌ శాఖ (AP Excise Department) ముఖ్యకార్యదర్శి ముకేశ్‌కుమార్‌ మీనా మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

16న కొత్త దుకాణాలు ప్రారంభం

ఈ నేపథ్యంలో ఈనెల 11వ తేదీకి బదులుగా 14వ తేదీన లాటరీ తీయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లాటరీ పద్ధతిలో  లైసెన్సులు ఖరారు చేయనున్నట్లు వెల్లడించాయి. ఇక 16వ తేదీ నుంచి కొత్త లైసెన్సుదారులు దుకాణాలు (New Wine Shops in AP) ప్రారంభించుకోవచ్చని సూచించాయి. అదే రోజు నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తున్న విషయం తెలిసిందే.

రూ.826.96 కోట్ల ఆదాయం 

మొత్తం 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్‌ ఇవ్వగా మంగళవారం రాత్రి 9 గంటల వరకు 41,348 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. నాన్‌ రిఫండబుల్‌ రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ.826.96 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. అయితే గడువు పొడిగిస్తున్న నేపథ్యంలో మరిన్ని దరఖాస్తులు (Wine Shop Tender Applications) వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

మద్యం దుకాణాల లైసెన్సుల కోసం అర్జీ చేసుకునే వారు ఆఫ్‌లైన్‌ విధానంలో నాన్‌ రీఫండ్‌బుల్‌ రుసుములు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు వెసులుబాట్లు కల్పించింది. రూ.2 లక్షల దరఖాస్తు రుసుముకు సంబంధించి దేశంలోని ఏ వాణిజ్య బ్యాంకులో తీసిన డిమాండ్‌ డ్రాఫ్ట్‌ (DD)నైనా అంగీకరిస్తామని తెలిపింది. గ్రామీణ బ్యాంకుల్లో డీడీలు తీస్తే మాత్రం అవి రాష్ట్ర పరిధిలోని బ్యాంకులే అయి ఉండాలని స్పష్టం చేసింది.

Related Posts

Vijay Deverakonda: ట్యాగ్లైన్ అందరూ వాడుతున్నరు.. మరి నాకెందుకలా?: విజయ్

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) కొత్త మూవీ కింగ్డమ్. పలు మార్లు వాయిదాపడ్డ ఈ మూవీ ఈ నెల 31న ఆడియన్స్ ముందుకు తీసుకొస్తామని మూవీ యూనిట్ సోమవారం సాయంత్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే విజయ్ సోషల్ మీడియాలో తన అభిమానులతో…

Gold Price: తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా లక్ష రూపాయలకు పైన పలికిన పుత్తడి ధరలు (Gold Price Hike) ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఒక కారణం అయితే, మరో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *