డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు తీవ్ర నడుమునొప్పి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రెండ్రోజుల క్రితమే ఆయన అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా పవన్.. తీవ్రమైన నడుమునొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రోజున నిర్వహించిన సమావేశానికి పవన్‌ కల్యాణ్‌ హాజరు కాలేదు.

పవన్‌కు నడుమునొప్పి

పవన్‌ రెండు వారాలుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారని, అందుకే సమావేశానికి రాలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ సీఎం చంద్రబాబుకు తెలిపారు. రెండు మూడు రోజుల్లో విధులకు హాజరవుతారని నాదెండ్ల చెప్పారు. దానికి ముఖ్యమంత్రి స్పందిస్తూ… ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించానని, దొరకలేదని అన్నారు. పవన్ ఆరోగ్య పరిస్థితిపై నాదెండ్లను ఆరా తీశారు.

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్‌(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *