
ఆంధ్రప్రదేశ్‌కు మరికొన్ని వందేభారత్ రైళ్లు(Vande Bharat Trains) రానున్నట్లు తెలుస్తోంది. AP నుంచి ఇప్పటికే కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించాలని కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. పలువురు MPలు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్(Railway Minister Ashwini Vaishnav)ను కలిసి ఈ విషయం గురించి విజ్ఙప్తి చేశారు. అయితే కొన్ని రైళ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.ఈ మేరకు ఒకటి, రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. తాజాగా మరో వందేభారత్ రైలు ప్రతిపాదనాలు తెరపైకి వచ్చాయని సమాచారం. విశాఖ(Vizag) నుంచి వందేభారత్ రైళ్ల సంఖ్యను మరిన్ని పెంచాలని పలువురు ప్రజా ప్రతినిధులు ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. విశాఖ నుంచి బెంగళూరు(Vizag to Bangalore)కూ ఈ రైలు నడపాలనే ప్రతిపాదన కూడా వచ్చింది.
తెరపైకి కొత్త ప్రతిపాదన
అయితే తాజాగా మరో ప్రతిపాదనను అధికారులు తీసుకొచ్చారు. విశాఖ నుంచి బెంగళూరు(Vizag to Bangalore)తో పాటుగా తిరుపతి(Tirupati)కి కూడా వందేభారత్(Vande Bharat Train) నడపాలని ప్రజా ప్రతినిధులు రైల్వే అధికారుల్ని కోరారు. అయితే తిరుపతి, బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్లాన్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ విషయం గురించి రైల్వే అధికారుల నుంచి సానుకూలంగా స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్ క్లాస్(Vande Bharat Sleeper Class) నడిపే అవకాశం ఉందని తెలుస్తుంది.
కనీసం ఆరునెలలు పట్టే అవకాశం
ప్రస్తుతం విశాఖ నుంచి 4 వందేభారత్ రైళ్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. విశాఖ నుంచి సికింద్రాబాద్ 2, భువనేశర్వ్, దుర్గ్కు చెరొకటి నడుస్తున్నాయి. విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్ నడిపేందుకు ఆలస్యం అవుతుందని.. కనీసం 6 నెలలైనా సమయం పట్టే అవకాశాలు కనపడుతున్నాయి. చెన్నై(Chennai)లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ(Integrated Coach Factory)లో ఈ వందేభారత్ స్లీపర్ క్లాస్ రైళ్లు ఉత్పత్తి చేస్తున్నారు. అయితే తొలి వందేభారత్ స్లీపర్ క్లాస్ జనవరి నాటికి అందుబాటులోకి వస్తుందనే సమాచారం ఉంది.