రేషన్​ కార్డుల KYC నిబంధనలు మారుస్తున్నారా..?

హైదరాబాద్​:

రేషన్​ కార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యలు అందరూ చౌకధరల దుకాణాలకు వెళ్లి వేలిముద్రలు వేసి KYC చేయాల్సి ఉందని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఈనెలలో రేషన్​ షాప్​లకు వెళ్లి ప్రజలు పెద్ద సంఖ్యలో వెళ్లి బయోమెట్రిక్​ పూర్తి చేస్తున్నారు. ఏదైనా కారణాల చేత వేలిముద్ర వేయని కుటుంబ సభ్యుల పేరును రేషన్​ కార్డు నుంచి తొలగిస్తారని ప్రభుత్వం ప్రకటన చేసింది.

ప్రభుత్వ ప్రకటన ప్రజల్లో గందరగోళం నెలకొంది. ప్రధానంగా ఉపాధి గల్ప్​ వెళ్లిన కుటుంభాలు ఇప్పటికిప్పుడు రేషన్​ కేవైసి చేసుకోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వకపోతే రేషన్​ తీసుకోవడంలో లబ్ధిదారులు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం కేవైసీ నిబంధనలు గడువుపై స్పష్టత లేదని గడుపు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇతర దేశాల్లో పనులు కోసం వెళ్లిన కటుంభాల కోసం నిబంధనలు సడలించి లబ్ధిదారులకు ఉపశమనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

Share post:

లేటెస్ట్