రేషన్‌ KYCకి గడవు లేదు

హైదరాబాద్​: రేషన్‌ కార్డు కేవైసీ చేయించకుంటే మీ కార్డులో పేరు తొలగిస్తారనే ప్రచారం జరుగుతుంది. కానీ ఎలాంటి తుది గడువు విధించలేదని, దీనిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వినియోగదారులు నమ్మొద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచించారు.

తప్పుడు ప్రచారాలు..ప్రజలు నమ్మద్దు:

రేషన్‌ కార్డు కేవైసీకి ఎలాంటి తుది గడువు విధించలేదని, దీనిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వినియోగదారులు నమ్మొద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కేవైసీ చేయించుకోని పక్షంలో కార్డులో పేరు తొలగిస్తారనేది పూర్తిగా దుష్ప్రచారమని కొట్టిపారేశారు.

రేషన్‌ లబ్ధిదారుల కేవైసీ పూర్తి చేయాలని కేంద్రం రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసిన మాట వాస్తవమేనని అన్నారు. తెలంగాణ పౌరసరఫరాల సంస్థ జనవరి వరకు కేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో మాత్రం అసత్య ప్రచారం జరుగుతున్నది.

దీనిపై ఇప్పటికే స్పందించిన రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కేవైసీ ప్రక్రియను ఆపేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రేషన్‌ కార్డుల్లో పేర్లున్నవారు చాలా మంది ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్నారని, కేంద్రం నిబంధనతో వారందరికీ ఇబ్బంది అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Share post:

లేటెస్ట్