అమరావతి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి పథకాలను మరింత విస్తృత్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, అలాగే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యచరణను ముందుకు తీసుకెళ్లడంపై ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, మేనిఫెస్టోను ఇంత పక్కాగా అమలు చేసిన..
అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో ఆయా పార్టీలు దూకుడు పెంచాయి. ఇక అధికార పార్టీ వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు పలు సూచనలు చేస్తున్నారు. సోమవారం విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షుల వరకు 8 వేల మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు కష్టపడాలని అన్నారు.