మన ఈనాడుః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి..ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి పోలీసుల తనిఖీల్లో రూ.కోట్ల నగదు పట్టుబడిన ఘటనలు చూస్తున్నాం. తెలంగాణ వాదంతో అధికారంలోకి వచ్చిన అప్పటి తెలంగాణ రాష్ర్ట సమితి..ఇప్పటి భారత రాష్ర్ట సమితి(BRS) సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లతోనే 100స్థానాలకు పైగా గెలువబోతున్నామని ప్రకటిస్తున్నారు. నోటిఫికేషన్‌కు ముందు అభ్యర్ధులను ప్రకటించి నియోజకవర్గాల్లో ప్రచారం హోరిత్తిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ రేపు, ఎల్లుండో అభ్యర్ధుల జాబితా ప్రకటించేందుకు సిద్దం అయింది. తొలి జాబితాలో 70స్థానాల్లో అభ్యర్ధుల వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తుంది. కమ్యూనిస్టులు హస్తం పార్టీతోనే చేతులు కలపడానికి ఒప్పందం కుదిరింది. అధికారపార్టీ కారు స్పీడుకు కళ్లెం వేసేందుకు కత్తి దూసేందుకు వ్యూహాలు వేస్తున్నారు. సీపీఎం, సీపీఐ పార్టీలకు చెరో రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపారని పార్టీ వర్గాల సమాచారం.
ఈనెల 18 కొండగట్టు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ ప్రారంభించబోతున్నారు. వైఎస్సార్ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోని అధికారం సాధించేంది. ఈసారి తెలంగాణలో ఇదే ఫార్ములా వాడి తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పెడతామని పార్టీ పెద్దలు సీరియస్‌గా ఉన్నారట.