BRSదే సెంచరీ..మళ్లీ KCRనే హ్యాట్రిక్​

హైదరాబాద్​: కేసీఆర్‌ పదేళ్ల పాలనతో దేశంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని .. మరింత అభివృద్ధి పరిచేందుకు మరోసారి బీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాల్సిన ఆవసరాన్ని మంత్రులు హరీశ్‌, కేటీఆర్‌ ప్రజలకు వివరిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా వినపడుతున్నది గులాబీనే సెంచరీ కొట్టేది..మళ్లీ కేసీఆరే హ్యాట్రిక్​ సాధించేది!

రాజకీయ కురుక్షేత్రంలో కృష్ణార్జునల మాదిరిగా మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ దూసుకుపోతున్నారు. 15రోజులుగా రాష్ట్రంలో వీరిద్దరూ సుడిగాలి పర్యటన చేస్తూ ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తూనే విపక్షాల బూటకపు హామీలను ఎండగడుతున్నారు.

గ్యారెంటీలతో మభ్యపెడుతున్న కాంగ్రెస్‌ అసలు రంగు బయటపెట్టి ప్రజలను చైతన్యపరుస్తున్నారు. దశాబ్దాలపాటు అధికారంలో ఉండి తెలంగాణను తొక్కేసిన తీరును ఉదాహరణలతో వివరిస్తున్నారు. పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను సైతం నెరవేర్చకుండా ఒక్క చాన్స్‌ ఇవ్వాలంటున్న బీజేపీ దమన నీతిపై దునుమాడుతున్నారు.
అభ్యర్థులను ఖరారు చేసేందుకే కాంగ్రెస్‌ పరిస్థితి ‘హస్త’వ్యస్తంగా మారితే, బీజేపీకి అభ్యర్థులే దొరక్క ఆపసోపాలు పడుతున్నది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్‌ కారు మాత్రం టాప్‌గేర్‌లో దౌడు తీస్తున్నది. క్యాడర్‌లో ఆత్మసైర్థం నింపుతున్నది.

సీఎం కేసీఆర్‌ పదేండ్లలో కష్టపడి తెలంగాణను పైకి తెచ్చిండు. కైలాసంలో నిచ్చెనలు ఎక్కినట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కించిండు. కరెంట్‌ బాధలు, మంచినీళ్ల బాధలు లేకుండా, ఎరువులకు తిప్పలు లేకుండా సంక్షేమ, వైద్య రంగంలో ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటా పోయిండు. మరి తప్పిపోయి కాంగ్రెసోళ్ల చేతులోకి పోతే కైలాసంలో పెద్దపాము మింగినట్టు సక్కగ జారి కింద పడుతం. ఇవాళ మంచిగ మీదికి పోతున్నాం. దీనిని ఇట్లనే ఇంకా పైకి తీసుకుపోవాలి.

 

Share post:

లేటెస్ట్